హిజాబ్ ధరించడానికి నిరాకరించిన జర్నలిస్టు... ఇంటర్వ్యూకు ఎగ్గొట్టిన‌ ఇరాన్ అధ్యక్షుడు

హిజాబ్ ధరించడానికి నిరాకరించినందుకు సీఎన్ ఎన్ జర్నలిస్టుకు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూకు ఇరాన్ అధ్యక్షుడు వెళ్ళకుండా ఎగ్గొట్టాడు. ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

Advertisement
Update:2022-09-23 11:26 IST

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని గురువారం అమెరికా జర్నలిస్టు,CNN చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియన్ క్రిస్టినా అమన్‌పోర్‌ ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి రైసీ ఒప్పుకున్నారు. దాంతో ఆమె ఇంటర్వ్యూకు కావాలసిన అన్ని ఏర్పట్లు చేసుకుంది.

ఇక కొద్ది సేపట్లో ఇంటర్వ్యూ ప్రారంభమవుతుందనగా ఇరాన్ అధ్యక్షుడి సహాయకులు జర్నలిస్టు దగ్గరికి వచ్చి హిజాబ్ ధరించాలని సూచించారు. ఆ సూచనను ఆమె తిరస్కరించింది.

"ఇంటర్వ్యూ ప్రారంభానికి 40 నిమిషాల ముందు ఒక సహాయకుడు వచ్చాడు. ఇది ముహర్రం, సఫర్ పవిత్ర మాసాలు కాబట్టి, నేను తలకు కండువా ధరించాలని అధ్యక్షుడు సూచించారని చెప్పారు. నేను సున్నితంగా తిరస్కరించాను. మేము న్యూయార్క్‌లో ఉన్నాము, ఇక్కడ హెడ్‌స్కార్ఫ్‌లకు సంబంధించి ఎటువంటి చట్టం లేదా సంప్రదాయం లేదు. గతంలో నేను ఇరాన్ అధ్యక్షులను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా హిజాబ్ వేసుకోబోనని చెప్పాను. "అని జర్నలిస్టు అమన్‌పూర్ ట్వీట్ చేశారు దాంతో పాటు ఆమె హిజాబ్ లేకుండా, ఖాళీ కుర్చీ ముందు కూర్చున్న తన చిత్రాన్ని పోస్ట్ చేశారు.

అమన్ పోర్ హిజాబ్ ధరించడానికి నిరాకరించిన తర్వాత, ఇంటర్వ్యూ రద్దు చేయబడింది.

" ఇంటర్వ్యూ జరగలేదు. ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నందున, ప్రజలను చంపుతున్నందున, ప్రెసిడెంట్ రైసీ మాట్లాడటానికి ఇది ఒక మంచి అవకాశం "అని ఆమె ట్వీట్ చేసింది.

మరో వైపు హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు గురువారం తీవ్రమయ్యాయి. అనేక చోట్ల పోలీసులు కాల్పులు జరపగా ఈ వారం రోజుల్లో 31 మంది నిరసనకారులు మరణించినట్టు ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొం ది.   

Tags:    
Advertisement

Similar News