కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ కలకలం

34 మందికి సోకిన వైరస్‌... ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన ఆ రాష్ట్ర గవర్నర్‌

Advertisement
Update:2024-12-19 12:34 IST

అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. 34 మందికి వైరస్‌ సోకింది. దాంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ కేసులను గుర్తించారు. దాంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ వెల్లడించారు. అయితే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్‌ సంక్రమించిన దాఖలాలు లేవని తెలిపారు. ఇప్పటివరకు వైరస్‌ బారినపడినవారు ఆ డెయిర్‌ ఫాం దగ్గరలో ఉన్, పనిచేసిన వ్యక్తులేనని అన్నారు. బర్డ్‌ ఫ్లూతో సాధారణ ప్రజలకు ముప్పేమీ లేదని సీడీఎస్‌ వెల్లడించింది. 

Tags:    
Advertisement

Similar News