మనవరాళ్లతో సరదాగా గోల్ఫ్ ఆడిన ట్రంప్
సండేరోజు తాతయ్యతో అంటూ ట్రంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆయన మనవరాలు కై
అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన మనవరాళ్లతో సరదాగా గడిపారు. ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్లో కై ట్రంప్, ఛోలె ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడారు. అప్పుడు అక్కడ ఒక స్పెషల్ గెస్ట్ కనిపించారు. డొనాల్డ్ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆ అతిథి. తాను షేర్ చేసిన ఫొటోలలో కై ఆయకు స్పెషల్ స్టేటస్ ఇచ్చింది.
సండేరోజు తాతయ్యతో అంటూ ట్రంప్‌తో ఉన్న ఫొటోలను కై ఇన్‌స్టాలో పోస్టు చేసింది. వాటిలోనే తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి మస్క్ కనిపించారు. ట్రంప్ ఫ్యామిలీలోని చిన్నారులతో అనుబంధం కారణంగా మస్క్‌కు ఆ అమ్మాయి 'అంకుల్ స్టేటస్' ఇచ్చింది. ఇదిలాఉంటే నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఫలితాల అనంతరం ట్రంప్ ఫ్యామిలీ ఫొటోలోనూ మస్క్ కనిపించారు. దానిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. వారిద్దరి (డొనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్) మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఉందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. వారి కుటుంబసభ్యుడిగా మారిపోయాడన్నారు.