బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ పై బ్యాన్‌!?

ఇస్కాన్‌ తో దేశానికి ప్రమాదముందని బంగ్లా హైకోర్టులో పిటిషన్‌

Advertisement
Update:2024-11-27 19:21 IST

ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్షీయస్‌నెస్‌ (ఇస్కాన్‌) పై బంగ్లాదేశ్‌ బ్యాన్‌ విధించబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇస్కాన్‌ పై నిషేధం విధించే దిశగా అడుగులు పడుతున్నాయని బంగ్లాదేశ్‌ అటార్నీ జనరల్‌ అజదుజ్జమాన్‌ ప్రకటించారు. ఇదే ఎజెండాతో తమ దేశ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పారు. బంగ్లాదేశ్‌ హైకోర్టు (సర్వోన్నత న్యాయస్థానం)లో ఇస్కాన్‌ ను నిషేధించాలని కోరుతూ ఒకరు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇస్కాన్‌ రాడికల్‌ గ్రూప్‌ అని, దానివల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లను పిటిషనర్‌ తరపు అడ్వొకేట్‌ ప్రస్తావించారు. చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టు, ఆయనకు బెయిల్‌ నిరాకరించిన తర్వాత జరిగిన అల్లర్లలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మృతిచెందారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌ సంస్థ గురించి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఇస్కాన్‌ మత ఛాందసవాద సంస్థ అని అటార్నీ జనరల్‌ వివరించారు. ప్రభుత్వం దానిపై నిషేధం విధించే ఆలోచనలో ఉందని కోర్టుకు తెలిపారు. ఇస్కాన్‌ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని గురువారం తమకు నివేదించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం రాత్రే ఇస్కాన్‌ పై నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువరించే అవకాశముందని సమాచారం.

Tags:    
Advertisement

Similar News