ఆ విషయంలో ట్రంప్‌ మద్దతు మస్క్‌కే

ఉద్యోగులందరూ గత వారం ఏం పని చేశారో వివరించాలన్నమస్క్‌ డిమాండ్‌ను సమర్థించిన డొనాల్డ్‌ ట్రంప్‌

Advertisement
Update:2025-02-25 13:15 IST

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన విషయం విదితమే. ఉద్యోగులందరూ గత వారం ఏం పని చేశారో వివరించాలని ఆదేశించారు. ఇందుకు సోమవారం అర్ధరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) వరకు గడువు విధించారు. మరికొన్ని గంటల్లో ఆ గడువు ముగియనున్న వేళ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీనిపై స్పందిస్తూ మస్క్‌ డిమాండ్‌ను సమర్థించారు. మరోవైపు కీలక విభాగాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఫెడరల్‌ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొన్నది.

ఫెడరల్‌ ఉద్యోగులకు యూఎస్‌ ఆఫీస్‌ ఆప్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి మస్క్‌ ఓ మెయిల్‌ పంపారు. ఉద్యోగులందరూ గత వారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో విరించాలని అలా చేయాలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మెయిల్‌కు సోమవారం రాత్రి 11.59 గంటల్లోపు ఐదు వాక్యాల్లో ఉద్యోగులు రిప్లై ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అటు మస్క్‌ నిర్ణయం రిపబ్లికన్లలోనే కొంతమందికి నచ్చలేదు. దీనివల్ల దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం బైటికి వెళ్లే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి. 

Tags:    
Advertisement

Similar News