దేశ ప్రజలకు దక్షిణ కొరియా అధ్యక్షుడి క్షమాపణ
మరోసారి తప్పు చేయనని విజ్ఞప్తి.. అభిశంసనకు ముందు ప్రకటన
దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించి అభిశంసనను ఎదుర్కొంటోన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ దేశ ప్రజలను క్షమాపణ కోరారు. అభిశంసన తీర్మానంపై కొన్ని గంటల్లో ఓటింగ్ జరగాల్సిన ఉండగా ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. మరోసారి తప్పు చేయనని విజ్ఞప్తి చేశారు. యాన్‌పై ఆ దేశ ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై శనివారం సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ జరగనుంది. 300 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో యాన్‌కు మద్దతుగా 200 మంది ఓటెయ్యాలి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్ పార్టీతో కలిపి మిగిలిన ప్రతిపక్షాలకు 192 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. యాన్ తెచ్చిన ఎమర్జెన్సీ మార్షల్ లాను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం 190 ఓట్లతో నెగ్గింది. అధికార పార్టీ సభ్యులు సైతం ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. దీంతో యాన్ గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. యాన్ భార్యకు ఒక పాస్టర్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఖరీదైన హ్యాండ్‌బాగ్ ఇప్పుడు ఆయన పదవికే ఎసరు తెస్తోంది.