టిక్ టాక్ ని ఢీ కొనేందుకు కొత్త యాప్ తో ఫేస్ బుక్ రెడీ

టిక్ టాక్ తో పోటీ పడేందుకు ఫేస్ బుక్ సంస్థ కొత్త యాప్ తో ముందుకొచ్చింది. యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ తో ఫేస్ బుక్ కొత్త యాప్ ఢీకొట్టగలదా అనేది వేచి చూడాలి.

Advertisement
Update:2022-07-23 14:40 IST

ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ చేస్తున్న మాయాజాలం అంతాఇంతా కాదు.. యువకులు, మహిళలు, పిల్లలు, చివరకు వృద్దులు కూడా టిక్ టాక్ మీద చూపుతున్న ఇంట్రెస్ట్ చెక్కుచెదరకుండా ఉంది. భారత్ ఈ యాప్ ను నిషేధించినప్పటికీ మిగతా దేశాల్లో కోట్లాది ఫ్యాన్స్ తో దీని పాపులారిటీ పెరిగిపోతోంది. దీంతో ఇప్పటివరకు తనకున్న ఫాలోయింగ్ ని టిక్ టాక్ పట్టేసుకుంటోందన్న కసి మీదున్న ఫేస్ బుక్.. ఇక నేనూ నీకు పోటీ ఇస్తానంటూ రంగంలోకి దిగింది. తన పాపులారిటీ తగ్గుతున్న నేపథ్యంలో . టిక్ టాక్ ని ఢీ కొనేందుకు అనువుగా ఓ యాప్ ని రూపొందించింది. గురువారం లాంచ్ చేసిన ఈ యాప్.. యూజర్ కనెక్షన్స్ నుంచి మరో ఆప్షన్ ని కలుపుతూ ఓ క్రోనోలాజికల్ ఫ్లోని ఆవిష్కరిస్తోంది. అవతలి వ్యక్తికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని యాజర్ అందించే సౌలభ్యం ఇందులో ఉంది. ఒక విధంగా టిక్ టాక్ మాదిరే ఇది కూడా 'ఫర్ యూ' అనే ఫీడ్ ని అందజేయడం విశేషం. వీడియో అల్గోరిథమ్ లక్ష్యమల్లా ఫ్యాన్స్ లేదా యూజర్లు ఏం చూడాలనుకుంటున్నారు .. లేదా ఏమాశిస్తున్నారు అన్నది 'ఎనలైజ్' చేసి వారికి దాన్ని చూపడమే.. తమ మల్టీ బిలియన్ డాలర్ యాడ్-డ్రివెన్ బిజినెస్ లో భాగంగా... సాధ్యమైనంత ఎక్కువ మంది యూజర్లను పెంచుకోవడమే దీని టార్గెట్. 'హోమ్' పేరిట గల పోస్టుల ఫీడ్ ని ఈ యాప్ ఓపెన్ చేయగలదు. ఈ క్రమంలో మిత్రుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇది పోస్టులను ఆఫర్ చేయగలదని, పైగా రెకమెండెడ్ కంటెంట్ ని కూడా ఇవ్వగలదని మెటా చెబుతోంది.

వేలాది సిగ్నల్స్ ని సులువుగా క్యాప్చర్ చేసి కంటెంట్ ని అర్థవంతంగా ఇచ్చే వెసులుబాటు కల్పించగల సత్తా ఈ సిస్టం కి ఉందట. అయితే తమ కాంటాక్టుల నుంచి యూజర్లు రివర్స్ క్రోనాలజికల్ ఆర్దర్లో పోస్టులను చూడగోరితే 'ఫీడ్స్' అనే ట్యాబ్ ని ట్యాప్ చేయవచ్చు.. ఇది ఫేస్ బుక్ తొలినాళ్ళనాటి అనుభూతినిస్తుంది. ఈ ఐడియా... హోమ్ పేజ్ గ్రీటింగ్ ఫేస్ బుక్ యూజర్లకు ఓ కొత్త కంటెంట్ ని ఇవ్వడానికి మార్గం సుగమం చేయడమే.. తమలో తాము కనెక్షన్లను కలిగి ఉన్న వ్యక్తులు లేదా గ్రూపులు పెట్టే పోస్టులకు 'ఫీడ్స్' సెక్షన్ రిజర్వ్ చేసినదని మెటా వివరిస్తోంది. మరి టిక్ టాక్ పాపులారిటీని ఈ ఫేస్ బుక్ కొత్త యాప్ ఎలా ఢీ కొట్టగలదో వేచి చూడాల్సిందే !





Tags:    
Advertisement

Similar News