చైనాలో భారీ అగ్నిప్రమాదం..36 మంది సజీవ దహనం..
అన్యాంగ్ సిటీలోని హైటెక్ జోన్ వెన్ఫెంగ్ జిల్లాలోని కైక్సిండా ట్రేడింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 36 మంది సజీవ దహనమవగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు గల్లంతయ్యారని తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అన్యాంగ్ సిటీలోని హైటెక్ జోన్ వెన్ఫెంగ్ జిల్లాలోని కైక్సిండా ట్రేడింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. 200 మందికి పైగా సహాయక సిబ్బంది, 60 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొందని వార్తలు వచ్చాయి. అగ్నిమాపక దళం బృందాలు 63 వాహనాలను సంఘటనా స్థలానికి పంపించాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు.
2015లో ప్రమాదకరమైన పేలుడు
మార్చి 2019లో షాంఘైకి 260 కిమీ దూరంలోని యాంచెంగ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 78 మంది మరణించారు. కిలోమీటర్ పరిధిలోని ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. అలాగే.. 2015లో ఉత్తర టియాంజిన్‌లోని ఒక రసాయనాల గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 165 మంది మరణించారు. చైనాలో సంభవించిన ఘోర ప్రమాదాల్లో ఇది ఒకటి.