Honda NX500 | భార‌త్ మార్కెట్‌లోకి హోండా ఎన్ఎక్స్‌500.. ధ‌రెంతో తెలుసా..?!

హోండా ఎన్ఎక్స్ 500 మోటారు సైకిల్ ఇంజిన్ 471సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్‌, ట్విన్ పార్ల‌ల్ డీవోహెచ్‌సీ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 46.5 బీహెచ్‌పీ విద్యుత్‌, 43 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది.

Advertisement
Update:2024-01-21 11:51 IST

Honda NX500 | ప్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట‌ర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. భార‌త్ మార్కెట్‌లోకి న్యూ అడ్వెంచ‌ర్ టూరిస్ట్ బైక్ ఎన్ఎక్స్‌500 ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.5.90 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌)గా నిర్ణ‌యించింది. భార‌త్‌లో ఇది కంప్లీట్‌లీ బిల్డింగ్ యూనిట్‌గా ప్రీమియం రిటైల్ ఔట్‌లెట్స్ బిగ్‌వింగ్స్‌ వ‌ద్దే విక్ర‌యిస్తారు. బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వ‌చ్చేనెల నుంచి డెలివ‌రీలు ప్రారంభించ‌నున్న‌ది. క‌వాసాకీ వెర్స్యిస్ 650, రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ హిమాల‌య‌న్ 450, కేటీఎం 390 అడ్వెంచ‌ర్ మోటారు సైకిళ్ల‌కు హోండా ఎన్ఎక్స్ 500 మోటారు సైకిల్ పోటీ ఇవ్వ‌నున్న‌ది.

స్టీల్ డైమండ్ ట్యూబ్ మెయిన్ ఫ్రేమ్‌పై అభివృద్ధి చేసిన న్యూ టూరిస్ట్ బైక్ ఎన్ఎక్స్‌500.. స్ట‌యిల్‌గా చూడ‌టానికి సీబీ500ఎక్స్‌ను పోలి ఉంటుంది. అద‌నంగా కొన్ని అప్‌డేట్స్ జ‌త చేశారు. ఆల్ ఎల్ఈడీ హెడ్ లైట్‌, లార్జ్ ఫెయిరింగ్‌, టాల్ వైండ్ స్క్రీన్‌, న్యూలీ డిజైన్డ్ టెయిల్ ల్యాంప్‌, ఎమ‌ర్జెన్సీ స్టాప్ సిగ్న‌ల్, 5-అంగుళాల ఫుల్ క‌ల‌ర్ టీఎఫ్‌టీ స్క్రీన్ విత్ క‌స్ట‌మైజ్డ్ డిస్‌ప్లే ఆప్ష‌న్‌తో వ‌స్తున్న‌ది. హోండా ఎన్ఎక్స్ 500 బైక్ మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్లు - గ్రాండ్ ప్రిక్స్ రెడ్‌, మ్యాట్టే గ‌న్ పౌడ‌ర్ బ్లాక్ మెటాలిక్‌, పెర‌ల్ హ‌రిజోన్ వైట్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది.

హోండా ఎన్ఎక్స్ 500 మోటారు సైకిల్ ఇంజిన్ 471సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్‌, ట్విన్ పార్ల‌ల్ డీవోహెచ్‌సీ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 46.5 బీహెచ్‌పీ విద్యుత్‌, 43 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. అసిస్ట్ / స్లిప్ప‌ర్ క్ల‌చ్‌తోపాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్ క‌లిగి ఉంటుంది. క‌స్ట‌మైజ్డ్ టీఎఫ్‌టీ స్క్రిన్‌తోపాటు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ యూజ‌ర్ల‌కు మెసేజ్‌ల కోసం హోండా రోడ్ స్యెంక్ యాప్‌, మ్యూజిక్/ వాయిస్ కంట్రోల్‌, ట‌ర్న్ బై ట‌ర్న్ నేవిగేష‌న్ ఫీచ‌ర్లు జ‌త చేశారు. కొత్త‌గా హోండా సెలెక్ట‌బుల్ టార్క్ కంట్రోల్ అనే పేరుతో ట్రాక్ష‌న్ కంట్రోల్ సిస్ట‌మ్ తీసుకొచ్చింది.

కంఫ‌ర్ట‌బుల్ రైడింగ్ కోసం స‌స్పెన్ష‌న్‌, బ్రేకింగ్ ఫీచ‌ర్లు జ‌త చేశారు. ఫ్రంట్‌లో అప్‌సైడ్‌-డౌన్ ఫోర్క్ స‌స్పెన్ష‌న్‌, రేర్‌లో 5-స్టేజ్ ప్రీ లోడ్ అడ్జ‌స్ట‌ర్‌తోపాటు ప్రో లింక్ మోనోషాక్ యూనిట్ కూడా ఉంది. ఫ్రంట్‌లో 296ఎంఎం డ్యుయ‌ల్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యుయ‌ల్ చానెల్ ఏబీఎస్‌, రేర్‌లో 240ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. హోండా ఎన్ఎక్స్‌500 బైక్ 19 అంగుళాల ఫ్రంట్‌, 17-అంగుళాల రేర్ ట్రయ‌ల్ ప్యాట్ర‌న్ టైర్ల‌తో వ‌స్తోంది. అంతే కాదు ఈ బైక్‌కు 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా జ‌త చేశారు.

Tags:    
Advertisement

Similar News