క్లైమాక్స్ మార్చేసి 20 ఏళ్ల తర్వాత 'బాబా' రీ రిలీజ్ .. డబ్బింగ్ కూడా చెప్పేసిన రజనీ

డిసెంబర్ 12వ తేదీన రజనీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న బాబా ఎటువంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి. 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న సినిమాకు రజనీకాంత్ వంటి అగ్ర హీరో మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం.

Advertisement
Update:2022-11-28 18:41 IST

ఇటీవల కాలంలో పాత సినిమాల రీ రిలీజ్‌లు ఎక్కువగా అవుతున్నాయి. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగానో, లేక సినిమా విడుదలై పదేళ్ళో, ఇరవై ఏళ్ళో పూర్తయిన సందర్భంగా ఆ సినిమాలను మళ్లీ 4కె ఫ్రింట్‌లతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదేవిధంగా 20 ఏళ్ల కిందట రజనీకాంత్ హీరోగా నటించిన బాబా సినిమా రీ రిలీజ్ కానుంది. డిసెంబర్ 12వ తేదీన రజనీకాంత్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

నరసింహా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని రజనీకాంత్ నటించిన సినిమా బాబా. సురేష్ కృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు బాగున్నప్పటికీ క్లైమాక్స్ బాగో లేకపోవడంతో అప్పట్లో ఈ సినిమా ప్లాప్‌గా నిలిచింది.

కాగా ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సందర్భంగా అప్పట్లో క్లైమాక్స్ కోసం చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను సినిమాలో జోడించనున్నారు. ఇందుకు సంబంధించి రజనీకాంత్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. తాజాగా ఆయన స్టూడియోలో కూర్చొని డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలు బయటకు రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమాలో కొన్ని సన్నివేశాలు మార్చడంతో బాబా ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి డిసెంబర్ 12వ తేదీన రజనీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న బాబా ఎటువంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న ఒక సినిమాకు రజనీకాంత్ వంటి అగ్ర హీరో మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం.

Tags:    
Advertisement

Similar News