పెద్ద‌పేగు క్యాన్స‌ర్ ప్రమాదంలో యువత..వారికే ఎందుకంటే

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాది వేగంగా పెరుగుతున్నాయి. మధ్య వయసువారే కాదు యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.

Advertisement
Update:2024-02-10 14:47 IST

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాది వేగంగా పెరుగుతున్నాయి. మధ్య వయసువారే కాదు యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఈ పెద్దపేగు క్యాన్సర్​ బారిన పడుతున్నారు. పెద్ద‌పేగు లేదా పురీష‌నాళంలో వ‌చ్చే క్యాన్స‌ర్‌ను పెద్ద‌పేగు క్యాన్స‌ర్ లేదా కోలోన్ క్యాన్స‌ర్ అంటారు. 50 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఈ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. గత 10 సంవత్సరాలలో పెద్దప్రేగు క్యాన్సర్ రోగుల సంఖ్య దాదాపు 20 రెట్లు పెరిగింది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిగ్గా లేకపోవడం ఇందకు కారణమంటున్నారు నిపుణులు.

పెద్దపేగు క్యాన్సర్​ లక్షణాలు ప్రారంభదశలో గుర్తించడం కష్టం. సాధారణంగా మలబద్ధకం, అతిసారం, మలం రంగులో మార్పులు, మలంలో రక్తం, పురీషనాళం నుంచి రక్తస్రావం, కడుపు ఉబ్బరం, తిమ్మిరి, పొత్తి కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఏవైనా సరే ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని ఖచ్చితంగా సంప్రదించాలి. అలసట, బలహీనతం, బరువు తగ్గడం, నెలకంటే ఎక్కువ కాలం మలంలో మార్పులు, పేగులు నిండుగా ఉన్న భావన, వాంతులు కూడా వీటి లక్షణాలే. కాలేయం, ఊపిరి తిత్తులకు క్యాన్సర్ వ్యాపిస్తే కామెర్లు, చేతులు, కాళ్లలో వాపు, శ్వాసలో ఇబ్బందులు, దీర్ఘకాలిక తలనొప్పివంటి లక్షణాలు కనిపిస్తాయి.

పెద్దపేగు క్యాన్సర్​కు గల కారణాలపై ఇంకా అధ్యయనం జరుగుతూనే ఉంది. పేగు సంబంధిత వ్యాధుల వ‌ల్ల, వంశ‌పారంప‌ర్యంగా వచ్చే అవకాశం ఉంది . ధూమపానం , మద్యం సేవించడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక కొవ్వు, కేలరీలు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం పెద్దపేగు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. వీటివల్లే క్యాన్సర్ వస్తుందని చెప్పలేము కానీ.. వీటి వల్ల వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒక పరిశోధన ప్రకారం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి ఈ అవకాశం ఎక్కువ.

పెద్దపేగు క్యాన్సర్​ను జీవనశైలిలో మార్పులతో నివారించలేము కానీ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెడ్ మీట్​కి , ప్రాసెసె చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. మొక్కల ఆధారిత ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించడం, వ్యాయామం చేయడం, మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచుకోవడం, బరువు తగ్గడం, స్మోకింగ్-డ్రింకింగ్ వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ అదుపులో ఉంటుంది. నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండడు కానీ, వారానికి రెండు మూడు సార్లు ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఉంటే మాత్రం దానిని మానుకోవాల్సిందే.

Tags:    
Advertisement

Similar News