వర్కవుట్స్ చేయడం కష్టంగా ఉందా? ఫంక్షనల్ ట్రైనింగ్ మీకోసమే..
శరీరాన్ని నచ్చిన ఆకృతిలోకి తెచ్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అందుకే ఫిట్‌నెస్‌లో కూడా చాలారకాల ట్రైనింగ్ పద్ధతులు పుట్టుకొచ్చాయి. అలాంటిదే ‘ఫంక్షనల్ ట్రైనింగ్’ కూడా. దీని ప్రత్యేకత ఏంటంటే..
శరీరాన్ని నచ్చిన ఆకృతిలోకి తెచ్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అందుకే ఫిట్‌నెస్‌లో కూడా చాలారకాల ట్రైనింగ్ పద్ధతులు పుట్టుకొచ్చాయి. అలాంటిదే ‘ఫంక్షనల్ ట్రైనింగ్’ కూడా. దీని ప్రత్యేకత ఏంటంటే..
ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది అన్ని వర్కవుట్స్‌లా కష్టపడి చేసేది కాదు. ఇందులో పెద్దగా శారీరక శ్రమ అవసరం ఉండదు. మజిల్స్ కోసం, బరువు తగ్గడం కోసం జిమ్‌కి వెళ్లి భారీ వర్కవుట్లు చేయాల్సిన పని లేదు. రోజువారీ పనుల లాంటి కొన్ని సింపుల్ వర్కవుట్స్ చేస్తే సరిపోతుంది.
ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది రిహాబిలిటేషన్ పద్ధతుల నుంచి వచ్చింది. గాయాలపాలైనప్పుడు, ఏదైనా అవయవానికి దెబ్బతగిలి వ్యాయామం చేయడం కుదరనివాళ్లకోసం కొన్ని చిన్నపాటి ఎక్సర్‌సైజులు డిజైన్ చేశారు. అవే ఫంక్షనల్ ట్రైనింగ్ మెథడ్స్. సింపుల్‌గా, ఈజీగా ఉంటూ.. బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం వీటి ప్రత్యేకత.
ఎలాంటి వారికైనా..
ఫంక్షనల్ ట్రైనింగ్ ద్వారా ఎలాంటి వారికైనా ట్రైనింగ్ ఇవ్వొచ్చు. ఎవరెవరు ఎలాంటి పనులు సులభంగా చేయగలరో అలాంటి యాక్టివిటీస్‌తోనే ఈ వ్యాయామాలు డిజైన్ చేశారు. ఇందులో రకరకాల ఎక్విప్‌మెంట్‌తో వ్యాయామాలు చేయొచ్చు. కెటిల్ బెల్, కేబుల్ మెషిన్స్, డంబెల్స్, బాటిల్ రోప్స్, బ్యాలెన్స్ డిస్క్స్, సాండ్ బాగ్స్, రెసిస్టెన్స్ ట్యూబ్స్ లాంటివి.
చిన్న పనులే..
ఇందులో ఎక్సర్‌సైజలన్నీ రోజూ చేసే పనుల్లాగానే ఉంటాయి. క్యారీ బ్యాగ్ మోయడం, బాస్కెట్ బాల్ ఆడటం, టైర్ మీద సుత్తితో కొట్టడం లాంటివి కూడా ఇందులో వ్యాయామాలే. అవసరాన్ని బట్టి రకరకాల ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని రోజూ మర్చిపోకుండా చేయాలి. వీటిని ఇంట్లోనే చేస్కోవచ్చు
టైరుతో..
ఒక పెద్ద టైరును, కొంత దూరం లాక్కెళ్లడం, టైరుపై సుత్తితో బలంగా కొట్టడం, టైరుని ఫ్లిప్ చేయడం, టైరు మీద గెంతడం ఇలాంటివన్నీ ఇందులో వర్కవుట్లు. ఇవి సులభంగానే కాకుండా సరదాగానూ ఉంటాయి.
బ్యాటిల్ రోప్
రెండు తాళ్లను బలంగా లాగటం, బలంగా పైకి కిందకి ఆడించడం ఇందులోని వర్కవుట్లు. తాడుని తీసుకుని చేతితో గట్టిగా రోప్ రెండు చివర్ల పట్టుకుని, వేగంగా పైకి కిందకి ఆడించాలి. రెండు తాళ్లు తీసుకుని ఒక పక్క రెండు చివర్లు దేనికైనా కట్టడంగాని నేలపై వదిలేయడంగాని చేయాలి. తర్వాత తాడు రెండో చివరని గట్టిగా పట్టుకుని పైకి కిందకి లేదా క్లాక్ వైజ్‌గా తిప్పాలి. కాళ్ళు చేతులు, నడుము భుజం చోట్ల కండరాలకి ఇది మంచి వ్యాయామం.
శాండ్ బ్యాగ్
నేలమీద ఒక ఇసుక బ్యాగ్ ఉంచి, దాని మీద పుషప్ పొజిషన్లోకి రావాలి. ఇప్పుడు కుడి చేతిని వదిలేసి రెండో చేత్తో బ్యాగ్‌ని లాగాలి. తరువాత చేయి మార్చుకుని ఇంకో చేత్తో బాగ్‌ని జరపాలి. ఇలా చేతులు మారుస్తూ ఈ సాండ్ బాగ్ ఎక్సర్ సైజు చేయొచ్చు.
కెటిల్ బెల్స్
కెటిల్ బెల్స్ అంటే హ్యాండిల్ ఉన్న వెయిట్స్. వాటిని పట్టుకుని కిందకుపైకి లేస్తుండడమే ఈ ఎక్సర్ సైజ్. దీని వల్ల శ్వాసక్రియ మెరుగవుతుంది.
ఒక కెటిల్ బెల్ ని పట్టుకుని నిల్చోవాలి. తరువాత, కొంచెం ముందుకు వంగి కాళ్ళ మధ్యగా కెటిల్ బెల్‌ని ఊపాలి. తరువాత బలం ఉపయోగిచి కెటిల్ బెల్‌ని భుజం ఎత్తు వరకూ తీసుకురావాలి. బెల్‌ను పైకి తీసుకుని వచ్చినప్పుడు, అది మిమ్మల్ని ముందుకు లాగడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు పొట్ట కండరాలు ప్లాంక్ చేస్తున్న తీరుగా తయారవుతాయి.
లాభాలివి..
ఈ వ్యాయామాల వల్ల ఫ్లెక్సిబిలిటీ, కోర్ స్ట్రెంత్ , శరీరం బ్యాలెన్స్ పెరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
వ్యాయామం కోసం ప్రత్యేకంగా టైం, శ్రమ వెచ్చించాల్సిన పనిలేదు సులభంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. అనుకున్న ఫిట్‌నెస్ గోల్స్‌ని తొందరగా చేరుకోవచ్చు.
పెయిన్ మేనేజ్‌మెంట్‌కి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది
ఇందులో వర్కవుట్స్ ద్వారా ఇంజూరీ అయ్యే ఛాన్స్‌లు చాలా తక్కువ
ప్రతి మజిల్‌కి కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది.
వయసు పై బడిన వాళ్లకు ఇదొక మంచి ఆప్షన్.
ఫంక్షనల్ ట్రైనింగ్‌లో ఉన్న ఎక్సర్ సైజులన్నీ మజిల్స్‌ని, జాయింట్స్‌ని పటిష్టం చేసేవే.
సులభంగా చేసే చిన్న ఎక్సర్‌సైజుల్లో మోచేతులు, మోకాళ్ళు, షోల్డర్స్, గొంతు, పొట్ట ఇలా అన్ని భాగాలకు వ్యాయామం అందుతుంది.
బాడీలోని ప్రతీ కండరంపై ఫిట్‌నెస్ ప్రభావం ఉంటుంది. దీంట్లో వర్కవుట్స్‌ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. స్ట్రెంత్ , టైం.. ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్లు ఎక్కువ సేపు వర్కవుట్ చేయొచ్చు. తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్లు టైం లిమిట్ పెట్టుకుని ప్రయత్నించవచ్చు.