మౌత్ వాష్ తో ముప్పు కూడా ఉందని మీకు తెలుసా?

మౌత్ వాష్ దంతాల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ ఈమధ్య దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు.

Advertisement
Update:2024-06-09 16:45 IST

మౌత్ వాష్ దంతాల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ ఈమధ్య దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మీరు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి . మౌత్ వాష్‌లను తరచూ వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందులోనూ ఆల్కాహాల్ ఆధారిత మౌత్ వాష్ లు వాడటం ప్రమాదకరమని ఒక తాజా అధ్యయనం పేర్కొంది.

 

నిజానికి మౌత్ వాష్ నోటిని ప్రకాశవంతంగా, శుభ్రంగా ఉంచుతుంది. అలాగే చల్లని, మంచి అనుభూతిని కలిగిస్తుంది. మన నోట్లోని చెడు బ్యాక్టీరియాను చంపుతుంది. నోట్లో మౌత్ వాష్ వేసుకున్నప్పుడు అది టూత్ బ్రష్ వెళ్ళలేని మూల మూలాలకు వెళుతుంది. ఇది చిగుర్ల వాపును కూడా తగ్గిస్తుంది. అయితే మౌత్ వాష్ ఒక్కటే వాడితే సరిపోదు. రోజూ బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. అలాగే మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మీ నోరు పొడిబారుతుంది. మౌత్‌ వాష్‌ రెగ్యులర్ ఉపయోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం, మౌత్ వాష్ రెగ్యులర్ ఉపయోగం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు మౌత్‌వాష్‌ని ఉపయోగించేవారిలో పదవ వంతు కంటే ఎక్కువ మందిలో కూడా ఈ అవకాశం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఇక బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ ఉపయోగిస్తే దంతక్షయ సమస్యలు వస్తాయని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

అలాగే రోజూ లేదా అతిగా మౌత్ వాష్ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే సింథటిక్ పదార్థాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. కాబట్టి దీనిని కనీసం రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఇం ట్లోనే సహజ సిద్దంగా వేప లేదా పుదీనాతో తయారు చేసుకునే మౌత్‌వాష్‌ లు అయితే రోజూ ఉపయోగించవచ్చు. వాటితో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News