ఇయర్ బడ్స్‌తో చెవులు పాడవ్వకూడదంటే..

కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ నుంచి దూర ప్రయాణాలు చేసేవాళ్ల వరకూ.. ఎవరి చెవుల్లో చూసినా ఇయర్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్సే కనిపిస్తున్నాయి

Advertisement
Update:2023-03-09 13:50 IST

కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ నుంచి దూర ప్రయాణాలు చేసేవాళ్ల వరకూ.. ఎవరి చెవుల్లో చూసినా ఇయర్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్సే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ సమయం పాటు అలా హై వాల్యూమ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల వినికిడి శక్తి దెబ్బతింటుందని చెప్తున్నారు డాక్టర్లు. ఇయర్ ఫోన్స్ వాడి వినికిడి పోగొట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అందుకే ఇయర్ బడ్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇయర్ బడ్స్ వల్ల చెవులు పాడవ్వకూడదంటే..

ఇయర్ బడ్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల చెవుల రంధ్రాలు పూర్తిగా మూసుకుపోతాయి. దాంతో చెవుల్లో బ్యాక్టీరియా పెరిగి రకరకాల సమస్యలొస్తాయి. అలాగే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవడం వల్ల ఇయర్ డ్రమ్ దెబ్బతింటుంది.

ఇయర్ ఫోన్స్‌తో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఇయర్ ఫోన్స్‌కు బదులు ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ వాడాలి. వీటిలో స్పీకర్‌‌కు చెవికి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. కాబట్టి చెవులు పాడయ్యే అవకాశం తక్కువ.

హెడ్ ఫోన్స్ ఎంచుకునే ముందు అందులో ‘నాయిస్ క్యాన్సిలేషన్’ ఫీచర్‌‌ ఉందో లేదో చూసుకోవాలి. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ ఉంటే బయట వినిపించే నాయిస్ అంతా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి తక్కువ వాల్యూమ్‌తో కూడా పాటలు వినొచ్చు. అలాగే కాల్స్ మాట్లాడొచ్చు.

హెడ్ ఫోన్స్ వాడే వాళ్లు టైం లిమిట్ పెట్టుకోవాలి. దీనికోసం 60–60 రూల్ పనికొస్తుంది. అంటే వాల్యూమ్ 60 శాతం కంటే తక్కువ ఉండాలి. అలాగే 60 నిముషాలకు మించి హెడ్స్ ఫోన్స్ వాడకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News