గురక తగ్గించేందుకు చిట్కాలు!

నిద్రలో గురక అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. కొన్ని స్టడీల ప్రకారం వందలో సుమారు 70 మందికి నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుందట.ఈ గురక వల్ల పక్కన ఉండే వాళ్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడమే కాకుండా గురక పెట్టే వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.

Advertisement
Update:2024-06-24 22:05 IST

నిద్రలో గురక అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. కొన్ని స్టడీల ప్రకారం వందలో సుమారు 70 మందికి నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుందట.ఈ గురక వల్ల పక్కన ఉండే వాళ్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడమే కాకుండా గురక పెట్టే వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. దీనికి ఎలా చెక్ పెట్టొచ్చంటే..

శ్వాస సమస్యలు లేదా శ్వాసనాళాల్లో ఉండే కొన్ని అడ్డంకుల చాలామందికి నిద్రలో గురక వస్తుంటుంది. గురక పెట్టి నిద్రపోవడం వల్ల ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. గురక ఓవరాల్ శ్వాస వ్యవస్థపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాదు గురక పెట్టేవారికి గుండె సమస్యలు, రక్తపోటు వంటివి వచ్చే ప్రమాదం ఉన్నట్టు స్టడీలు చెప్తున్నాయి.

గురక తగ్గించుకునేందుకు పడుకునే పొజిషన్ మార్చుకోవాలి. వెల్లకిలా పడుకోవడం వల్ల గురక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడమవైపుకి తిరిగి పడుకుని చూడాలి. అలాగే అధిక బరువు కూడా గురకకు కారణమవుతుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

గురక సమస్య వేధిస్తున్నవాళ్లు కార్డియో వ్యాయామాలు ద్వారా లంగ్ కెపాసిటీని పెంచుకోవాలి. అలాగే ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్‌‌సైజుల ద్వారా కూడా గురక సమస్య తగ్గే అవకాశం ఉంది.

ఇకపోతే దాల్చిన చెక్క లేదా యాలకులకు గురక తగ్గించే లక్షణం ఉంది. కాచిన నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి లేదా యాలకుల పొడి వేసి అందులో తేనె కలుపుకుని పడుకునేముందు తాగితే గురక నుంచి రిలీఫ్ ఉంటుంది.

పాలల్లో పసుపు కలిపుకుని తాగినా గురక తగ్గుతుంది. పాలల్లో పసుపు, సొంఠి వంటివి కలుపుకుని తాగడం ద్వారా శ్వాస నాళాలు క్లియర్ అవుతాయి. తద్వారా గురక తగ్గుతుంది.

Tags:    
Advertisement

Similar News