కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పర్మినెంట్‌గా పోవాలంటే..

కళ్లకింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ ముఖం అందాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు అలా వదిలేసే కొద్దీ అవి మరింత నల్లగా మారుతూ ముడతలు పెరుగుతుంటాయి.

Advertisement
Update:2023-12-02 08:40 IST

ఇప్పుడున్న రోజుల్లో డిజిటల్ స్క్రీన్‌ను తప్పించుకోవడం కుదిరే పనికాదు. ఎంతలేదన్నా రోజుకి కొన్ని గంటల పాటు మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడాల్సి వస్తుంది. దీనివల్ల చాలామందికి కంటి కింద వలయాలు కామన్ అయిపోయాయి. మరి దీనికి పర్మినెంట్‌గా చెక్ పెట్టేదెలా..?

కళ్లకింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ ముఖం అందాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు అలా వదిలేసే కొద్దీ అవి మరింత నల్లగా మారుతూ ముడతలు పెరుగుతుంటాయి. అందుకే వీటికి పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచించాలి.

కంటి కింద వలయాలకు కంటితోనే సంబంధం. కళ్లు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే సర్కిల్స్ ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. అందుకే రోజుకి ఏడు లేదా ఎనిమిది గంటల స్లీప్ ఉండేలా చూసుకోవాలి.

రోజువారీ ఆహారంలో విటమిన్–సీ ఉండేలా చూసుకోవడం ద్వారా చర్మంలో కొల్లాజెన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం తాజాగా మారుతుంది.

ప్రతిరోజూ తగినంత నీటిని తాగకపోవడం కూడా డార్క్ సర్కిల్స్‌కు కారణమవుతుంది. కాబట్టి హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా రోజూ నాలుగు లీటర్ల నీళ్లు తాగేలే చూసుకోవాలి.

రక్తహీనత, నిద్రలేమి, విటమిన్ డెఫీషన్సీ వంటి సమస్యలు కూడా మచ్చలు, ముడతలను పెంచుతాయి. కాబట్టి అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోపాటు మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడడం, ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి వాటిని తగ్గించాలి.

ఇకపోతే డిజిటల్ స్క్రీన్స్‌పై పనిచేసేవాళ్లు ప్రతిరోజూ పడుకునే ముందు కొద్దిగా అలోవెరా జెల్‌ తీసుకుని కళ్లకింద రాసుకుని పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల కంటి కింద ఉండే చర్మం ఏరోజుకారోజు డీటాక్స్ అవుతుంది. అలాగే కంటిపై బ్లూలైట్ ఎఫెక్ట్‌ను తగ్గించేందుకు కళ్లద్దాలు కూడా వాడొచ్చు..

*

Tags:    
Advertisement

Similar News