చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి

చలికాలంలో ఉండే వాతావరణం మన శరీరంపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే మన శరీరం కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల లివర్ పని తీరులో మార్పులు చోటు చేసుకుంటాయి.

Advertisement
Update:2022-12-19 19:40 IST

ఏడాదిలో మిగిలిన రోజుల కంటే చలికాలంలో మన శరీరానిపై వైరస్‌ల దాడి ఎక్కువగా ఉండటంతో పాటు ఇతర రోగాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శీతాకాలంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా మన దినచర్యలో కూడా మార్పులు వస్తుంటాయి. వ్యాయామం, నడకకు కేటాయించే సమయం తగ్గిపోతుంది. ఆహారపు అలవాట్లు కూడా ఛేంజ్ అవుతాయి. చలికాలంలో ఒక్కసారిగా జీవన శైలిలో మార్పు రావడం వల్ల బ్లడ్ షుగర్స్ లెవెల్స్ మన నియంత్రణలో లేకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో ఉండే వాతావరణం మన శరీరంపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే మన శరీరం కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల లివర్ పని తీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. లివర్ శక్తి కోసం అధికంగా గ్లూకోజ్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవెవ్స్ పెరగడానికి కారణం అవుతాయి. మధుమేహంతో బాధపడే వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే కొన్ని నియమాలు పాటిస్తే షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి:

వాతావరణ చల్లగా ఉన్న సమయంలో షుగర్ పేషెంట్లకు సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. అందుకే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం మంచిది. చేతులు చల్లగా ఉంటే బ్లడ్ షుగర్ రీడింగ్ సరిగా చూపించదు. అందుకే హీటర్లు, చలి మంట ద్వారా.. చేతులను రబ్ చేసుకోవడం ద్వారా వాటిని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ రీడింగ్స్ సరిగా వస్తాయి.

ఒత్తిడి తగ్గించుకోవాలి :

వాతావరణం చల్లగా ఉంటే శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదు. శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని చేయడం వల్ల.. చక్కని నిద్ర పడుతుంది. ఏకాగ్రతను కూడా సాధన చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శారీరిక మార్పులు జరుగకుండా వ్యాయామం కాపాడుతుంది. ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండటానికి సహకరిస్తుంది.

ఆహారపు అలవాట్లు:

మనం ప్రతీ రోజు తినే ఆహారానికి బదులుగా.. చలికాలంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. చలికాలంలో షుగర్ పేషెంట్లు టీ, కాఫీలకు బదులుగా.. గ్రీన్ టీ, వెజిటెబుల్ సూప్ తీసుకోవడం మంచిది. అలాగే ప్యాక్ చేసిన ఆహారం, వేపుడు పదార్థాలు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఆహారంలో ప్రతీ రోజు కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.

చురుకుగా ఉండాలి :

చలికాలంలో బద్దకంగా ఒకే దగ్గర కూర్చోవడం, గదిలో నుంచి బయటకు రాకుండా ఉండటం చాలా ప్రమాదం. అందుకే రోజులో కొద్ది సేపైనా నడక, ఎండకు ఉండటం మంచిది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. వ్యాయామం కారణంగా చురుకుగా ఉండి శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

క్రమం తప్పకుండా షుగర్ చెక్ చేసుకోవాలి:

శీతాకాలంలో క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. వాతావరణంలో మార్పుల కారణంగా షుగర్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే దానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకొని, మాత్రలు వేసుకోవడం మంచింది. ఆకలి ఎక్కువగా వేసినా.. ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా నియంత్రించు కోవాలి. నిలువ చేసిన ఆహారాన్ని తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News