ఫ్రూట్స్ ఇలా తినకూడదని తెలుసా?

పూర్తి ఆరోగ్యం కోసం డైట్‌లో ఫ్రూట్స్ తీసుకోవడం అవసరం. పండ్లతో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. అయితే పండ్లను సరైన విధంగా తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలొస్తాయని డాక్టర్లు చెప్తున్నారు.

Advertisement
Update:2023-09-07 15:45 IST

ఫ్రూట్స్ ఇలా తినకూడదని తెలుసా?

పూర్తి ఆరోగ్యం కోసం డైట్‌లో ఫ్రూట్స్ తీసుకోవడం అవసరం. పండ్లతో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. అయితే పండ్లను సరైన విధంగా తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలొస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. పండ్లు తినేటప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే..

పండ్లలో ఎంజైమ్‌లు, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈజీగా అరిగిపోతాయి. కాబట్టి వీటిని వండిన ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కలిపి తీసుకోకూడదు. అంటే భోజనం తర్వాత పండ్లు తినే అలవాటు అంత మంచిది కాదన్నమాట.

ఫ్రూట్స్‌ను ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి తీసుకుంటుంటారు చాలామంది. లేదా బయట దొరికే ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్స్ వంటివి తింటుంటారు. అయితే పండ్లను ఇలా తీసుకోవడం వల్ల వాటి నుంచి అందాల్సిన పోషకాలు పూర్తి స్థాయిలో అందవు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పండ్లలో ఉండే సహజమైన పోషకాలు నశిస్తాయి.

చాలామంది ఫ్రూట్స్ తినడం కంటే ఫ్రూట్ జ్యూస్‌లు తాగడానికి ఎక్కువ ఇష్టం చూపుతుంటారు. దీనివల్ల పండులో ఉండే ఫైబర్ కంటెంట్‌ను పూర్తిగా మిస్ అవుతున్నట్టే అని తెలుసుకోవాలి.

బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది పండ్లను రాత్రిళ్లు తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల నిద్రకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పండ్లలో ఉండే గ్లూకోజ్‌లు తక్షణ శక్తినిస్తాయి. శరీరాన్ని హుషారుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి నిద్రకు ముందు ఫ్రూట్స్ తినడం అంత మంచి ఆప్షన్ కాదు.

ఇకపోతే ఫ్రూట్స్ తిన్న తర్వాత నీళ్లు తాగడం కూడా మంచి అలవాటు కాదు. పండ్లలో ఉండేది పూర్తిగా నీటిశాతమే కాబట్టి మళ్లీ నీళ్లు తాగడం వల్ల అరుగుదల సమస్యలొస్తాయి.

ఇలా తినాలి

పండ్లను ఉదయాన్నే తీసుకోవడం మంచి ఆప్షన్. ఒకవేళ భోజనం తర్వాత తినాలనుకుంటే అరగంట తర్వాత తినాలి.

పండ్ల రసాలు తాగేబదులు నేరుగా ఫ్రూట్స్‌ను తీసుకుంటే శరీరానికి కావాల్సన ఫైబర్ కూడా అందుతుంది. పండ్ల తొక్కల్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

పండ్లు ఫ్రిజ్‌లో కంటే బయటి వాతావరణంలోనే తాజాగా ఉంటాయి. కాబట్టి ఫ్రూట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకుని తినాలి. వారాల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి.

పండ్లు సహజమైన ఆహారం. కాబట్టి వీటిని వండిన ఆహారాలతో కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదం చెప్తోంది. ఇలా కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News