చలికాలం తెచ్చె డిప్రెషన్.. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్!

చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్ ​(SAD) అనేది చాలామందిని వేధించే సమస్య. ఇది చలికాలంలో మొదలై.. సీజన్ మారేటప్పుడు తగ్గిపోతుంది.

Advertisement
Update:2022-12-09 17:35 IST

చలికాలం తెచ్చె డిప్రెషన్.. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్!

సీజన్ మారితే వాతావరణంలోనే కాదు, మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్ ​(SAD) అనేది చాలామందిని వేధించే సమస్య. ఇది చలికాలంలో మొదలై.. సీజన్ మారేటప్పుడు తగ్గిపోతుంది. ఇదెలా ఉంటుందంటే.

శరీరం పాటించే బయోలాజికల్ క్లాక్ లేదా సర్కేడియన్ రిథమ్.. చలికాలంలో దారి తప్పుతుంది. ఫలితంగా డిప్రెషన్ మొదలవుతుంది. దీన్నే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' అంటారు. సీజన్ మారడం వల్ల కొంతమందిలో డిప్రెషన్, ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం, నీరసం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవి ఆడవాళ్లలో ఎక్కువ.

అలాగే సీజనల్ డిజార్డర్ వల్ల నిద్రలో కూడా మార్పులొస్తాయి. కొంతమంది ఎక్కువగా, మరికొంతమంది తక్కువగా నిద్రపోతారు. అలాగే వింటర్​లో పగటిపూట కాంతి ఉండదు. కాబట్టి డి విటమిన్​ లోపిస్తుంది. ఈ కారణాల వల్ల సెరటోనిన్, మెలటోనిన్ లాంటి స్లీప్ హార్మోన్ లెవల్స్ దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది.

సొల్యూషన్ ఇదే

సీజన్ మారినప్పుడు టైం టేబుల్ మారకుండా చూసుకోవాలి. టైంకి తినడం, ఎక్సర్​సైజ్ చేయడం వంటివి చేయాలి. విటమిన్ డి లోపించకుండా చూసుకోవాలి . ఒంటరిగా ఉండకుండా మనుషులతో కలుస్తుండాలి. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్.. వంశపారపర్యంగా కూడా వస్తుంది. అప్పటికే డిప్రెషన్​లో ఉన్నవాళ్లలో ఈ డిజార్డర్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తర, దక్షిణ ధృవాలకు దగ్గరగా ఉండేవాళ్లు కూడా దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సీజన్ మారినప్పుడు ఒత్తిడి, డిప్రెషన్‌ను గుర్తిస్తే.. సైకియాట్రిస్ట్ ను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి డాక్టర్లు లైట్​ థెరపీ లేదా కౌన్సెలింగ్, మెడికేషన్ లాంటివి ఇస్తారు.

Tags:    
Advertisement

Similar News