ఆ మ్యాన్‌ ఈటర్‌ చనిపోయింది!

వయనాడ్‌లో మహిళను చంపిన పులి హతం

Advertisement
Update:2025-01-27 10:07 IST

కేరళలోని వయనాడ్‌ లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మ్యాన్‌ ఈటర్‌ (ఆడపులి) చనిపోయింది. ఆ పులి కంట పడితే కాల్చేయండి కేరళ సర్కారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే దానిని ఎవరైనా చంపేశారా? ఇతర కారణాలతో ఆ పులి చనిపోయిందా అనేది తేలాల్సి ఉంది. వయనాడ్‌ సమీపంలోని పంచరకొల్లి అటవీప్రాంతంలో ఈ ఆడపులి రాధ అనే గిరిజన మహిళపై దాడి చేసి చంపేసింది. దీంతో పంచరకొల్లి, చీరక్కర, పిలకవు మూన్నురోడ్, మణియంకున్ను ప్రాంతాల్లో 48 గంటల కర్ఫ్యూ విధించారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులు, ప్రత్యేక పనులపై బయటకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్టు సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ పులి సంచారంతో వయనాడ్‌ ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వయనాడ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి చనిపోయి కనిపించింది.

Tags:    
Advertisement

Similar News