పంజాగుట్ట షాన్‌బాగ్ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.;
Advertisement
హైదరాబాద్ పంజాగుట్ట ప్రధాన రహదారిలోని షాన్‌బాగ్ హోటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం ఐదో అంతస్తులోనుంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు భారీ ఎగసి పడతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం పైనుంచి మంటలు ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో బిల్డింగ్‌లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మణికొండలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Advertisement