హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి
నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.;
Advertisement
హైదరాబాద్ పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలోని ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలోమూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిచ్చెన ద్వారా ఫస్ట్ ఫ్లోర్‌కు చేరుకొని, తలుపులను పగులగొట్టి ఒక చిన్నారి, ఇద్దరు మహిళలను బయటకు తీసుకువచ్చామని తెలిపారు. వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Advertisement