మద్యం అమ్మకాల్లో అక్రమాలపై సిట్
విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి మధ్య మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. విజయవాడ సీపీ రాజశేఖర్ బాఉబ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటు చేశారు. సిట్‌లో ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్‌పీ శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీని సభ్యులుగా నియమించారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో రూ.90 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, ఇందులో నగదు లావాదేవీలతో పాటు హాలో గ్రాముల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సిట్ వీటిపై విచారణ చేపట్టి ప్రతి 15 రోజులకోసారి సీఐడీ చీఫ్ కు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement