ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కొనసాగుతున్న కేసులు;
Advertisement
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్విని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు రేవతి ఇంటికి వెళ్లారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త డైరెక్టర్ చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ కూడా బలవంతంగా తీసుకెళ్లారు. అలాగే రేవతికి చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సీజ్ చేశారు. రైతుభరోసా రావడం లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు గానూ కేసులు పెట్టి రేవతిని అరెస్టు చేసినట్లు సమాచారం.
Advertisement