మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి విస్తుపోయే నిజాలు
దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తాడు. యూట్యూబ్ వీడియోలు చూసి తప్పించుకుంటాడన్నడీసీపీ
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా 428 తూటాలు దొరికాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నేరస్థుడు ప్రభాకర్‌ను విచారించగా.. అతను ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్థుడు. 2022 మార్చిలో విచారణ కోసం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నిన్న రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు తుపాకుఉ, 23 తూటాలు సీజ్ చేశాం. 2013 నుంచి ప్రభాకర్ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 80 కేసుల్లో నిందితుడు.
తెలంగాణలో 11, ఏపీలో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డాడు. ఇళ్లలో దొంగతనం చేయడం రిస్క్ అని శివార్లలో ఉండే విద్యాలయాల్లో చోరీ చేస్తున్నాడు. దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తడు. పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ వీడియోలు చూస్తాడు. గతంలో జైలులో ఉన్నప్పుడు ఓ ఖైదీతో గొడవపడి కక్ష పెంచుకున్నాడు. అతన్ని చంపాలని జైల్లో పరిచయమైన ఖైదీల సహకారంతో బీహార్‌లో గన్ కొనుగోలు చేశాడు. గన్ కొనుగోలుచేయడానికి, నేరాలు చేయడానికి సహకరించిన వారందరనీ అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రభాకర్ 66 కేసుల్లో అరెస్టయ్యాడు. 8 నెలల కిందటి నుంచి తుపాకులు వాడుతున్నాడని డీసీపీ తెలిపారు.