హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కమలాపూర్ మండలంలోని అంబాల వద్ద సోమవారం కూలీలను తరలిస్తోన్న ఆటో ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement