మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది మృతి

బైక్‌ను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు.

Advertisement
Update:2024-11-29 15:40 IST

మహారాష్ట్రలోని గొండియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 35 మంది ప్రయాణికులతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సు నాగ్‌పూర్‌ నుంచి గోండియాకు వెళ్తోంది. ఖజ్రీ గ్రామ సమీపంలోకి రాగానే బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్‌ సాయంతో బోల్తా పడిన బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు ప్రమాదపై బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోండియా జిల్లాలోని సడక్‌ అర్జుని సమీపంలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమన్నారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News