మరుగుదొడ్డిలో శిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని
ప్రసవం తర్వాత ఆడ శివువును చెత్తకుండీలో పడేసిన అమానవీయ ఘటన తంజావూర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
కాలేజీలో ఓ విద్యార్థిని మరుగుదొడ్డిలో శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన అమానవీయ ఘటన తంజావూర్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కాలేజీలో 4 వేల మందికిపైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఇదిలా ఉండగా 20 ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. శుక్రవారం క్లాస్‌లో ఉండగా ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే మరుగుదొడ్డికి వెళ్లి ఆడ శివువును ప్రసవించింది. అనంతరం యూట్యూబ్ వీడియో చూసి బొడ్డు కోసింది. తర్వాత బిడ్డను కాలేజీలోని చెత్త కుండీలో పడేసి చెత్తతో కప్పేసింది. తర్వాత ఏం జరగనట్లు వెళ్లి క్లాస్‌లో కూర్చుకున్నది. రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు అధ్యాపకులకు తెలిపారు. దీంతో వారు 108 అంబులెన్స్‌ను పిలిపించి కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను విచారించి మళ్లీ కాలేజీకి అంబులెన్స్ పంపి శిశువును తీసుకొచ్చేలా చేశారు. బిడ్డకు వెంటనే చికిత్స అందించి బతికించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఘటనపై నాశ్చియార్ కోయల్ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.