కాలువలోకి దూసుకెళ్లిన వాహనం తొమ్మిదిమంది మృతి
వాహనం సర్దారేవాలా గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లిన వాహనం
హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఓ వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మహిళలు సహా తొమ్మిదిమంది మృతి చెందారు. ఇద్దరిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం గాలింపు కొనసాగుతున్నది. ఫతేహాబాద్ జిల్లాలో మెహమరా గ్రామానికి చెందిన 14 మంది.. పంజాబ్‌లో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం సర్దారేవాలా గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లింది. దట్టమైన మంచు ఉండటం, నియంత్రణ కోల్పోవడంతో వాహనం ప్రమాదానికి గురైనట్లు సమాచారం.విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు.. గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ప్రమాద ఘటన నుంచి సుమారు 50 కి.మీ. దూరంలో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. తొమ్మిది మంది మృతి చెందినట్లు గుర్తించగా.. గల్లంతైన వారి కోసం 50 మంది రెస్క్యూ బృందం గాలింపు కానసాగిస్తున్నదని అధికారులు వెల్లడించారు.