ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

గంగలూరు అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

Advertisement
Update:2025-02-01 15:41 IST

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలోని గంగలూరు అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ మావోయిస్టులు అక్కడ ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టీఎఫ్‌ బలగాలు యాంటి నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టుల కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆటోమేటిక్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News