మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు

మొదట 118 (1) సెక్షన్‌ కింద నమోదు చేసి, తర్వాత 109 సెక్షన్‌ చేర్చిన పోలీసులు

Advertisement
Update:2024-12-12 11:23 IST

సినీనటుడు మోహన్‌బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని సెక్షన్‌ను మార్చారు. పహాడీ షరీఫ్‌ పోలీసులు మొదట 118 (1) సెక్షన్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత 109 సెక్షన్‌ చేర్చారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఛానల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైక్‌ గుంజుకుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ ఛానల్‌ కెమెరామన్‌ కిందపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. 

Tags:    
Advertisement

Similar News