ఆ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబయిలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు
Advertisement
వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు పెద్దషాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ముంబయిలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో గత ఏడేళ్లుగా విచారణ జరుగుతుండగా ఆర్జీవీ కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో మండిపడిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాలని , లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్‌గోపాల్ వర్మపై మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో ఫిర్యాదు చేశారు.
Advertisement