మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఈ ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రన్నింగ్‌లో ఉండగా ఆ రైలులో మంటలు అంటుకున్నాయని వదంతులు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు. పట్టాలపై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఆగుతుండగానే రైలు నుంచి బయటకు దూకారు. అదే సమయంలో రెండో ట్రాక్‌పై నుంచి వేగంగా దూసుకువచ్చిన కర్నాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని చయెప్తున్నారు.
Advertisement