మ‌హారాష్ట్ర‌లో భారీ పేలుడు..ఐదుగురు కార్మికులు మృతి

మహారాష్ట్రలో భండారా జిల్లాలో భారీ పేలుడు సంభవింది.

Advertisement
Update:2025-01-24 12:48 IST

మహారాష్ట్రలో భండారా జిల్లాలో భారీ పేలుడు సంభవింది. దీంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నాగ‌పూర్‌కు స‌మీపంలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ పైక‌ప్పు కూలిపోయింది. పేలుడు స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో 12 మంది కార్మికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇద్ద‌రిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

ఘ‌ట‌నాస్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ప్ర‌మాదాన్ని భండారా జిల్లా క‌లెక్ట‌ర్ సంజ‌య్ కోల్టే ధృవీక‌రించారు. ఈ భారీ పేలుడు శ‌బ్దాలు ఐదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపించిన‌ట్లు స్థానికులు తెలిపారు. పేలుడు సంభ‌వించిన స‌మ‌యంలో పెద్ద ఎత్తున పొగ ఎగిసిప‌డింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News