మృతదేహాన్ని ముక్కలు చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరం

మీర్‌పేట పీఎస్‌ పరిధి జిల్లెలగూడ హత్య కేసులో కొనసాగుతున్నదర్యాప్తు

Advertisement
Update:2025-01-23 11:47 IST

మీర్ పేట పీఎస్ పరిధి జిల్లెల గూడ న్యూవెంకటేశ్వర కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన విషయం విదితమే. ఫొరెన్సిక్‌ బృందం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నది. మరోవైపు నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతోనే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను పోలీసులు బేరీజు వేసుకుంటున్నారు. హత్య ఘటన విని భవనం ఖాళీ చేసి వెళ్లిపోయిన అందులోని నివాసితులు. ఈ ఘటనలో కాలనీలోని వాళ్లంతా భయాందోళకు గురయ్యారు. హత్య జరిగిన ఇంటికి చుట్టుపక్కల ఉన్నవాళ్లలో కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల వద్దకు వెళ్లిపోయారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తితో 13 ఏండ్ల కింద పెండ్లి అయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం డీఆర్‌డీవోలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జిల్లెల గూడ న్యూ వెంకటేశ్వర్‌నగర్‌ కాలనీలో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురుమూర్తి భార్య తలపై రెండుసార్లు గట్టిగా కొట్టగా ఆమె స్పహ తప్పి పడిపోయింది. మరణించినట్లు భావించి మృతదేహాన్ని అదృశ్యం చేయాలనుకున్నాడు. మృతదేహాన్ని కత్తితో ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడిని, శరీరం అవశేషానలు సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. 


Tags:    
Advertisement

Similar News