మావోయిస్టుల మందుపాతర నిర్వీర్యం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పట్టివేత
Advertisement
భద్రత బలగాల వరుస దాడులతో తీవ్రంగా నష్టపోతున్న మావోయిస్టు పార్టీ ప్రతీకారం తీర్చుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. భద్రత బలగాలను మట్టుబెట్టేందుకు భారీ మందుపాతరను ఏర్పాటు చేసింది. భద్రత బలగాలు దానిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో మావోయిస్టుల స్కెచ్ బయట పడింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గల బాసగూడ నంచి ఆవపల్లికి మార్గంలో గల నేషనల్ హైవేపై గల కల్వర్టు కింద ఈ మందుపాతర లభ్యమైంది. దీనిని ముందే గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక పోలీసులతో పాటు భద్రత దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Advertisement