నడిరోడ్డుపై ఆటోడ్రైవర్‌ హత్య

అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసుకున్న ఆటో డ్రైవర్లు రాజ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు

Advertisement
Update:2025-01-22 13:36 IST

హనుమకొండలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఆటోడ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డీమార్ట్‌ ఎదురుగా అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకున్నది. మడికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. వీరిలో రాజ్‌కుమార్‌ మృతి చెందాడు. సుబేదారి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News