మాజీ ఎమ్మెల్సీ మృతి
మాజీ ఎమ్మెల్సీ ఆర్, సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్, సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌గా తెలంగాణ ఉద్యమకారునిగా, శాసనమండలి సభ్యులుగా సత్యనారాయణ చేసిన సేవలు సమాజం మరచిపోలేనివి అని ఆయన అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని సీఎం తెలిపారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2007 లో గెలుపొందారు సత్యనారాయణ. 2008 లో తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. TSPSC మెంబర్ గాను పని చేశారు.
సత్యనారాయణ. ఇక 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్, సత్యనారాయణ. ఇక మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్