హైదరాబాద్‌లో హోటల్ గొడ కూలి ముగ్గురు మృతి
ఎల్బీ నగర్‌లో ఓ హోటల్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు
Advertisement
హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హోటల్ సెల్లార్‌లో తవ్వకాల పనులు జరుగుతుండగా ప్రమాదశాత్తు మట్టిదిబ్బ కూప్పకూలింది ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతులంతా బిహార్ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం కూలీ పనులు చేసుకోవడానికి నగరానికి వచ్చినట్లుగా సమాచారం. దశరథ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement