జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్సై శ్వేత మృతి
గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు-బైకు ఢీకొని ప్రమాదం.. ఈ ఘటనలో బైక్ వాహనదారుడు కూడా మృతి
Advertisement
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్సై శ్వేత సహా ఇద్దరు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు-బైకు ఢీకొని ఈప్రమాదం జరిగింది. ఎస్సై శ్వేత కారులో అర్నకొండ నుంచి జగిత్యాలకు వెళ్తున్నారు. ప్రమాదంలో కారు ఢీకొని బైక్ వాహనదారుడు కూడా మృతి చెందాడు. బైక్‌ను ఢీకొన్న తర్వాత కారు చెట్టును ఢీకొన్నది. దీంతో ఎస్ శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. శ్వేత జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూర్, కథలాపూర్, పెగడపల్లిలో ఎస్సైగా పనిచేశారు.
Advertisement