గోవాలో టాలీవుడ్ నిర్మాత ఆత్మహత్య
గోవాలో నిర్మాత కె.పి చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు
టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
కేపీ చౌదరి 2016లో 2016లో సినిమా రంగంలోకి అడగు పెట్టిన కేపీ చౌదరి కబాలి చిత్రానికి సహా నిర్మాతగా ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. కృష్ణ ప్రసాద్ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలం కేంద్రంగా తెలుస్తోంది. 2023లో ఆయన దగ్గర 93 గ్రామూల కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.