Banaras: ట్రయినింగ్ ఇచ్చి మరీ డైరక్ట్ చేశాడట

బనారస్ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు జైద్. కెమెరాకు కొత్త అయినప్పటికీ ఇతడ్ని డైరక్ట్ చేయడం తను పెద్దగా కష్టపడలేదంటున్నాడు దర్శకుడు జయతీర్థ.

Advertisement
Update:2022-11-03 11:00 IST

కొత్త హీరోతో వస్తున్న డబ్బింగ్ సినిమా బనారస్. కన్నడ పొలిటీషియన్ జమీర్ అహ్మద్ కొడుకు జైద్ హీరోగా పరిచయమౌతున్న సినిమా బనారస్. తొలి సినిమానే పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశాడు ఈ హీరో. ఈ సినిమాకు జయతీర్థ దర్శకుడు. ఓ కొత్త హీరోను డైరక్ట్ చేయడం కొంచెం ఇబ్బందే అయినప్పటికీ, తనకు అలాంటి సమస్య ఎదురు కాలేదంటున్నాడు ఈ డైరక్టర్.

"బెల్ బాటమ్ మూవీ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటివరకూ 7 సినిమాలు చేస్తే 4 సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులంతా మంచి స్థాయిలో ఉన్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తాడని ఆశిస్తున్నాను."

ఇలా జైద్ డెబ్యూపై స్బందించాడు జయతీర్థ. ఓ కొత్త హీరో సినిమాకు టైమ్ ట్రాలెవ్ కాన్సెప్ట్ ఎంచుకున్నారేంటనే విమర్శల్ని ఈ దర్శకుడు తిప్పికొడుతున్నాడు. ఇందులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కంటే లవ్-రొమాన్స్-యాక్షన్ ఎక్కువగా ఉంటాయని, సినిమా చూసిన తర్వాత ఆ విషయం అర్థమౌతుందని చెబుతున్నాడు.




Tags:    
Advertisement

Similar News