లైలా సినిమాను చంపేయకండి : హీరో విశ్వక్ సేన్
లైలా ఫ్రీరిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి
విశ్వక్‌సేక్ నటించిన లైలా ఫ్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీని టార్గెట్‌గా నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్‌పై హీరో విశ్వసేక్ క్షమాపణలు చెప్పారు. వేదికపై ఆయన మాట్లాడేటప్పుడు మేం లేము ఉంటే వెంటనే మైక్ లాక్కునేవాడిని అన్నారు. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ 25కే ట్వీట్లు చేశారు. రెండు రోజుల్లో మా సినిమా జనాల్లోకి వెళ్తోంది. కానీ నా సినిమాను చంపేయకండి. ఏ వ్యక్తితో మాట్లాడి మేము ఈ విషయాన్ని లాగదలుచుకోవడం లేదు. సపోర్ట్ లైలా అంతే. అతను మాట్లాడిన దానికి.. మా సినిమాకు సంబంధం లేదు. సినిమా ఈవెంట్‌లో పాలిటిక్స్, నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే. చాలా కష్టపడి సినిమా తీశామన్నారు.
నేను ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నా. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దంటూ' అభిమానులకు విజ్ఞప్తి చేశారు హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ‘లైలా’ . ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో.. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని నటుడు పృథ్వీరాజ్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది