తెలుగు ఫిలిం ఛాంబర్ పేరుతో ప్రతి ఏటా అవార్డులు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.
Advertisement
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ తరపున బెస్ట్ ప్రదర్శన కనబరిచిన సినిమాలకు, నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. టాలీవుడ్ సినిమా పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనుంది.
ఆ రోజున ప్రతి నటీనటుడి ఇంటిపై, రాష్ట్రంలోని థియేటర్లపైనా జెండా ఎగురవేయాలని పేర్కొంది. ఈమేరకు తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిల్మ్ ఛాంబర్ పేర్కొన్నాది. ఫిలిం ఛాంబర్ నిర్ణయంపై అందులోని సినీ ఆర్టిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement