ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా టెలీకాస్ట్

దీనికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌కు నిర్మాత బన్ని వాసు విజ్ఞప్తి

Advertisement
Update:2025-02-10 11:56 IST

తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న మూవీ 'తండేల్‌' ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పైరసీ దీన్ని వేధిస్తున్న విషయం విదితమే. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఈ మూవీ ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు స్పందించారు. సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ పోస్టు పెట్టారు 'ఓ మీడియా సంస్థలో వచ్చిన వార్త ద్వారా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో తండేల్‌లో ప్రదర్శించారని తెలుసుకున్నాం. ఇది చట్టవిరుద్ధం, అన్యాయం మాత్రమే కాదు సినిమాకు జీవం పోయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఎంతోమంది వ్యక్తులను అవమానించడమే. ఒక సినిమా ఎంతో మంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతల కల' అని పేర్కొన్నారు. దీనికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావును బన్నివాసు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

Tags:    
Advertisement

Similar News