నాకు భద్రతపై ఎప్పుడూ నమ్మకం లేదు

ఎప్పుడూ సెక్యూరిటీ సిబ్బందితోనే ఉండాలని అనుకోవడం లేదన్న బాలీవుడ్‌ నటుడు

Advertisement
Update:2025-02-11 13:30 IST

దుండగుడి దాడి నుంచి బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కోలుకుంటున్నారు. ఈ దాడి అనంతరం ఆయన తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భద్రత గురించి కీలక విషయాలు వెల్లడించారు. నాకు (సైఫ్‌ అలీఖాన్‌) ఎప్పుడూ భద్రతపై నమ్మకం లేదు. ఈ దాడి జరిగిన తర్వాత సైఫ్‌కు సెక్యూరిటీ ఎందుకు లేదు? అని అందరూ అడిగారు. నాకు దానిపై నమ్మకం లేదు. ఎలాంటి భద్రత వద్దు. ఎప్పుడూ సెక్యూరిటీ సిబ్బందితోనే ఉండాలని నేను అనుకోలేదు. ఈ దాడిని ఓ పీడకలగా భావిస్తున్నాను. దీని తర్వాత కూడా నేను సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం లేదు. నాకు ఎలాంటి ముప్పు ఉండదు. ఈ దాడి పొరపాటుగా జరిగిందని భావిస్తున్నాను. ఇదేం నా జీవితాన్ని మార్చదు. అలా మార్చాలని కూడా నేను అనుకోవడం లేదు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి చేసి దాడే కానీ.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని సైఫ్‌ వివరించారు.

Tags:    
Advertisement

Similar News