ప్రధాని మోదీతో నాగార్జున కుటుంబం భేటీ

నాగేశ్వర్‌ రావుపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

Advertisement
Update:2025-02-07 15:54 IST

ప్రధాని నరేంద్రమోదీతో హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న నాగార్జున కుటుంబ సభ్యులు పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీస్‌ కు వెళ్లారు. అక్కినేని నాగేశ్వర్‌ రావుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన అక్కినేని కా విరాట్‌ వ్యక్తిత్వ పుస్తకాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇటీవల మన్‌ కీ బాత్‌ లో అక్కినేని నాగేశ్వర్‌ రావు ఇండియన్‌ సినిమాకు చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. ప్రధానికి నాగార్జున ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో నాగార్జున కుటుంబ సభ్యులు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల, బీజేపీ ఎంపీలు తదితరులు ఉన్నారు.




 


Tags:    
Advertisement

Similar News