Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ 'లిప్‌కిస్' వివాదం

Aishwarya Rai: ప్రముఖ నటి, అందాల తార ఐశ్వర్యా రాయ్‌ ని ట్రోలర్స్ టార్గెట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.

Advertisement
Update:2022-11-16 19:45 IST

Aishwarya Rai: ఐశ్వర్య 'లిప్‌కిస్' వివాదం

ప్రముఖ నటి, అందాల తార ఐశ్వర్యా రాయ్‌ ని ట్రోలర్స్ టార్గెట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ చేస్తూ సెలబ్రిటీల మనసులను గాయపరుస్తున్నారు. కొందరు వాటిని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం సీరియస్‌గానే రియాక్ట్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్యా రాయ్ .. తన కూతురు ఆరాధ్య జన్మదినం సందర్భంగా షేర్ చేసిన ఓ ఫొటో వివాదంగా మారింది. తన కూతురుకు శుభాకాంక్షలు చెబుతూ.. 'నా ప్రేమ.. నా ప్రాణం ఐలవ్ యూ ఆరాధ్య' అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఇందుకు తన కూతురును లిప్ కిస్ చేస్తున్న ఫొటోను జత చేశారు. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఐశ్వర్యా మీరు కూడా ఇంతలా దిగజారాలా? అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.అటెన్షన్ మీ వైపు తిప్పుకొనేందుకు ఇటువంటి ఫొటోలు పెడతారా? అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు.



మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వ్యవహారంలో ఐశ్వర్యకు మద్దతు తెలిపిన వారు కూడా ఉన్నారు. కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఆమె పెట్టిన ఫొటోలో తప్పేముందని కొందరు ప్రశ్నించారు. తల్లి తన బిడ్డను లిప్ కిస్ చేస్తే అందులో కూడా నెగిటివ్ ని వెతకడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇవాళ ఐశ్వర్యారాయ్ వివాదానికి కేంద్ర బిందువయ్యారు.

Tags:    
Advertisement

Similar News