అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశాం : బాలకృష్ణ

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Update:2025-01-10 21:29 IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన మూవీ ‘డాకు మహారాజ్‌’ప్రజ్ఞా జైస్వాల్‌ , శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లు. బాబీ దేవోల్‌, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషించారు. చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వేడుక లో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. ఎంపీ భరత్‌ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతు వాస్తవానికి ఈ ఫంక్షన్ అనంతపురంలో జరుపుకోవాల్సింది. కానీ తిరుమలలో తొక్కిసలాటలో మరణించడంతో వాయిదా వేశాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విశ్వానికి విశ్వనటరూపం ఎలా ఉంటుందో గుర్తించిన విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారకరామారావు-బసవతారకమయికి, కళామాతల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో ఎవ్వరూ చేయని పాత్రలు నాన్న గారు చేశారు. కుమారుడిగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చేశానని తెలిపారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సూపర్ హిట్ అయ్యాయి. డాకు మహారాజ్ కూడా సూపర్ హిట్ అవుతుంది. నా ప్రతీ సినిమాలో మహిళలకు ప్రత్యేకత ఉంటుంది. సినిమా నుంచి సందేశం ఇవ్వాలని భావిస్తాం. తెలుగు వారి గొప్పతనం ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగిందని తెలిపారు. చిత్ర యూనిట్ తరపున కూడా ప్రకటించారు. క్రమశిక్షణ కలిగిన వారు తన అభిమానులు అని తెలిపారు. ఇది ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా. ఈ చిత్రం ట్రైలర్‌, ‘దబిడి దిబిడి’ పాట హిట్‌ అయ్యాయంటే మీరే కారణం. మూవీని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా. బాలకృష్ణ సర్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నటిగా ఆయన్నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా’’ అని ఊర్వశీ రౌతేలా పేర్కొన్నారు

Tags:    
Advertisement

Similar News