'గేమ్‌ ఛేంజర్‌' టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

సినిమా విడుదల రోజు (శుక్రవారం) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Advertisement
Update:2025-01-08 23:45 IST

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన గురించి అసెంబ్లీ వేదికగా సీఎం మాట్లాడుతూ.. ఇక నుంచి టికెట్ల ధర పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని చెప్పారు. సినిమా ప్రముఖులతో భేటీ సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటనకే కట్టుబడి ఉంటామని చెప్పారు. కానీ అదంతా ప్రకటలకే పరిమితమని మరోసారి రుజువైంది.

రామ్‌ చరణ్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన మూవీ 'గేమ్‌ ఛేంజర్‌'. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. సినిమా విడుదల రోజు (శుక్రవారం) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్‌ ఇచ్చింది. రిలీజ్‌ రోజు సింగిల్‌ స్క్రీన్స్‌లో అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 150 పెంచుకోవడానికి, జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ. 50, మల్టీ ప్లెక్స్‌ల్లో రూ. 100 పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంటకు పెంచిన ధరతో బెనిఫిట్‌ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది.

ఏపీలో ఇలా

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్‌ షోకూ అనుమతి ఇచ్చిన విషయం విదితమే.అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను రూ. 600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీ ప్లెక్స్‌లో అదనంగా రూ. 175 (జీఎస్టీతో కలిపి), సింగిల్‌ థియేటర్లలో రూ. 135 (జీఎస్టీతో కలిపి) టికెట్‌ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News